- వ్యవహారం సీరియస్.. అధికారుల మెడకు ఉచ్చు
- మండల స్థాయి క్రీడల నిర్వాహన అధికారికంగానా… అనధికారమేనా…
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 8 (జనవాహిని న్యూస్) :- మండల స్థాయి క్రీడలు ఏ ఉద్దేశంతో నిర్వహించారో.. తెలియదు కానీ ప్రోటోకా(రు)ల్ చిచ్చు రగిలింది. అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తుంది. మండల స్థాయి క్రీడలు అధికారికంగా జరిగాయా.. ప్రైవేట్ పరంగా నిర్వహించారా.. తెల్చలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అధికారికంగా నిర్వహిస్తే.. ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదన్నది ప్రశ్న. ప్రైవేట్ పరంగా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా క్రీడలు ఎలా నిర్వహించారన్నది ప్రశ్న. ప్రైవేట్ పరంగా క్రీడలు నిర్వహిస్తే పాఠశాలల విద్యార్థులను ఎందుకు భాగస్వాములను చేసినట్లు… వివిధ శాఖల అధికారులు ఎందుకు భాగస్వాములైనట్లు తేల్చవలసిన ప్రశ్న. ఉన్నత అధికారుల అనుమతులు లేకుండా సామూహికంగా బడిపంతులు ఎవరి ఆదేశంతో సి ఎల్ పెట్టినట్లు అనే అనుమానం వస్తుంది. దీంతో ప్రోటోకా(రు) ల్ రగడ రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తుంది. మరోసారి రాజకీయ వేదిక కానుంది. వివరాల్లోకి వెళితే.వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో గత నెల 29, 30, 31 వ తేదీలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడలకు ప్రోటోకాల్ విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంలో జెడ్పి సీఈఓ ను జిల్లా అదనపు కలెక్టర్ నివేదిక కోరగా సీఈవో యాలాల ఎంపీడీవోకు మెమో జారీ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శాసనమండలి స్పీకర్ కు జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి జిల్లా పాలనాధికారి కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆదివారం వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన కంటి వెలుగు సమావేశానికి జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావడంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రశ్నిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకానికి సంబంధించి నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ గైర్హాజరు కావడం నిర్లక్ష్యమేనని, ఆమె పనితీరుతోప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్సి మహేందర్ రెడ్డి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఇదిలా ఉండగా ప్రోటోకాల్ వ్యవహారంపై ప్రభుత్వ కార్యదర్శి వి.శేషాద్రి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తుంది. వాస్తవంగా ప్రోటోకాల్ విషయమై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్న కంటి వెలుగు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ముందు తేల్చుకోవాలని అని జడ్పి చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యాలాల మండలంలో జరిగిన సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదన్నది ఫిర్యాదు. విజయ సంకల్ప్ పేరుతో యాలాల ఎంపీపీ బాలేష్ గుప్త ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడలు అధికారికంగా నిర్వహించారా.. ప్రైవేట్ పరంగా నిర్వహించారా అన్నది తెలియదు. మండల స్థాయి క్రీడలకు ప్రోటోకాల్ పాటించలేదన్నది మాత్రం జెడ్పి చైర్ పర్సన్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఉన్నత అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మండల స్థాయి క్రీడలు అధికారికంగా అయితే.. ప్రోటోకాల్ పాటించనందున సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే ప్రైవేట్ పరంగా నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఉన్నత అధికారుల అనుమతి లేకుండా క్రీడలలో పాల్గొనడానికి ఎవరు అనుమతించారని జవాబు చెప్పవలసి ఉంటుంది. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా సామూహికంగా కొందరు విద్యాధికారి ఎంపీడీవో. ఉపాధ్యాయులు సిఎల్ పెట్టి క్రీడల కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధిత అధికారులు సంజాయిస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు వికారాబాద్ డి ఈ ఓ రేణుక దేవి పాల్గొన్నారు వారితో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ క్రీడల నిర్వహణ అధికారికంగానా.. అనధికారికంగానా అని తెలుసుకోకుండా జిల్లా స్థాయి నుంచి గ్రామీణ ఉపాధ్యాయుల వరకు పాల్గొనడం కోస మెరుపు….