• ఆధారాలతో సహా సీఎం సి ఎస్ కు ఫిర్యాదు చేస్తాం..
  • కలెక్టర్ అవినీతిపై రైతుల నుండి తమకు ఫిర్యాదులు అందాయి
  • జడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి

వికారాబాద్ ప్రతినిధి జనవరి 8 (జనవాహిని న్యూస్) :- భూ సమస్యలు పరిష్కరించకుండా జిల్లా కలెక్టర్ రైతుల ఉసురు పోసుకుంటుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె. నిఖిల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జిల్లా పాలనాధికారి ముఖ్యమైన ప్రభుత్వ సమీక్ష సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి భూ సమస్యలను పరిష్కరించకపోవడమే గాక ఆదివారం కలెక్టరేట్ లో నిర్వహించిన కంటి వెలుగు సమావేశానికి రాష్ట్ర మంత్రి, తాను, ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి, ఎంపీపీలు హాజరవుతే కలెక్టర్ హాజరు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చించే జడ్పీ సాధారణ సమావేశాలకు కూడా ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ రావడం లేదన్నారు. గత సాధారణ సమీక్ష సమావేశానికి రాకుంటే జిల్లా మంత్రి వారం రోజుల్లో కలెక్టర్ తో సమావేశం నిర్వహించడం జరుగుతుందని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకుండా కలెక్టర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు . ప్రజా ప్రతినిధులుగా ప్రజల సమస్యలు కలెక్టర్ కు వివరించినా ఎవరి మాట వినకుండా ఒక ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఆఫీసు కార్యాలయం దగ్గర గంటల తరబడి నిలబడిన సమయం ఇవ్వకుండా అవమానానికి గురి చేయడం ఎంతవరకు సబబు అన్నారు. ఇక కలెక్టర్ అవినీతిపై నిలదీసే ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు మీడియా ప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు కలెక్టర్ ఏ ఒక్క గ్రామంలో నైనా, మండల కేంద్రాల కైనా, ఒక్కరోజైనా వెళ్లి పర్యటించారా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో ఏమైనా ప్రత్యేక అధికారి పాలన నడుస్తుందా..? మీ వల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఈ లాంటి అధికారి మాకు అవసరం లేదనీ, త్వరలోనే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ సి ఎస్ కు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. కలెక్టర్ అవినీతి పట్ల జిల్లాలోనీ ఎంతోమంది రైతుల నుండి తమకు ఫిర్యాదులు అందాయని భూముల సెటిల్మెంట్లకు సంబంధించి ఆధారాలతో సహా చీఫ్ సెక్రటరీ (సిఎస్) కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here