- ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులు
- గ్రామాలలో నెలకొన్న సమస్యలకు ఫుల్ స్టాప్
- 5న బషీరాబాద్ మండలం ఏకాంబరి దేవస్థానం నుండి ప్రారంభం
- పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే
- నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు నుండి అడిగి తెలుసుకుని పరిష్కరించనున్న ఎమ్మెల్యే
తాండూరు డిసెంబర్ 03 జనవహిణి :- తాండూరు నియోజకవర్గ గ్రామపంచాయతీలకు 50 లక్షల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామ పంచాయతీల రూపంలో రేఖలు మార్చేందుకు కంకణ బద్ధుడైన పైలెట్ రోహిత్ రెడ్డి ఈనెల 5వ తారీఖు నుండి పల్లె పల్లెకు పైలట్ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని మంజూరైన 50 లక్షల నిధులను గ్రామపంచాయతీలో కనీస వసతుల కల్పనకు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు దోహదపడతాయని అన్నారు.మరి కొద్ది రోజులలోనే తాండూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామపంచాయతీలన్నీ సమస్యలు లేని గ్రామపంచాయతీలుగా రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే హైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.