• కారు దిగి.. కమలంతో చెలిమి..
  • తాండూరులో బి ఆర్ ఎస్ కు భారీ గండి
  • కాసేపట్లో బిజెపిలో చేరనున్న బి ఆర్ ఎస్ నేతలు
  • జిల్లాలో బలపడుతున్న బిజెపి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 19 (జనవాహిని న్యూస్) :- ఎప్పుడు కయ్యానికి కళ్ళు దువ్వుతూ.. మూడుముక్కలైన బి ఆర్ ఎస్ పార్టీ చీలిక నేతలు మరి కాసేపట్లో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపి పార్టీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమీక్షంలో ఢిల్లీలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ బుధవారం మధ్యాహ్నానికి బిజెపి పార్టీలో చేరుతున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. రాష్ట్ర బిజెపి పార్టీలో చేరిక కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నేతృత్వంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ మురళీకృష్ణ గౌడ్లు బిజెపి పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు బిజెపి నాయకులు ఢిల్లీలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ అప్పట్లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కీర్తిశేషులు మాజీ మంత్రి చందు మహారాజ్ వంశానికి చెందిన నరేష్ మహారాజ్ రాజకీయ వారసత్వంగా టిడిపి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. అయితే అప్పట్లో టిఆర్ఎస్ లో ఇప్పుడు బి ఆర్ ఎస్ పార్టీలో తటస్థంగా ఉంటున్నారు బి ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల బీజేపీ పార్టీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నరేష్ మహారాజును బిజెపి పార్టీలోకి ఆహ్వానిస్తూ సంకేతాలు పంపించారు. దీంతో ఆయన కార్యచరణ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో బిజెపి పెద్దల సమక్షంలో బిజెపి పార్టీలో చేరనున్నారు. అలాగే యంగ్ లీడర్ డైనమిక్ హీరోగా పే రోoదినా వికారాబాద్ జిల్లా మాజీ మురళీకృష్ణ గౌడ్ బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తాండూరు నియోజకవర్గం లో అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ బలపితం నియోజకవర్గానికి కొత్త నాయకుని పరిచయం చేసిన ఘనత మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ కున్నట్లు చెప్పుకుంటారు. ఇటీవల బి ఆర్ ఎస్ పార్టీ వికారాబాద్ గ్రంథాలయ చైర్మన్ గా కొనసాగుతున్న మురళి కృష్ణ గౌడ కు సమాచారం ఇవ్వకుండా ఆయనను తొలగించి ఆయన స్థానంలో బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్ గౌడ్ ను వికారాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమించారు. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో ఉన్న రాజకీయ విభేదాలు కారణంగానే వికారాబాద్ గ్రంధాలయ చైర్మన్ గా ఉన్న మురళీకృష్ణ గౌడ్ ను తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో టిఆర్ఎస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గినట్లు భావించిన మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ భావించి బిజెపి పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో ఆయన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో బిజెపిలో చేరడానికి వెళ్లినట్లు తెలుస్తుంది దీంతో బిజెపి పార్టీ వికారాబాద్ జిల్లాలో తన ప్రబల్యాన్ని పెంచుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని రాజకీయ సమీకరణాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here