• పురాతన ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
    ఉదృతంగా ప్రవహించే నది ప్రవాహ ప్రాంతాల దగ్గర సెల్ఫీలు దిగడం ప్రమాదకరం..
    కరణ్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి

తాండూరు రూరల్ జులై 11 జనవాహిని ప్రతినిధి :- ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన ఇళ్లలో నివాసం ఉంటున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరణ్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి సూచించారు. తాండూర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం నాడు అన్ని గ్రామాలలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలకు అవగాహన కోసం మట్టితో నిర్మించిన పురాతనమైన (శిథిలావస్థలో) ఇండ్లలో నివసిస్తున్నవారు స్థానిక సర్పంచు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ భవనాలలో తలదాచుకునేందుకు తగిన విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాత్రి వేళలో నిద్రలో ఉన్న సమయంలో వర్షం కారణంగా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని దీంతో ప్రాణానికే ముప్పు పొంచి ఉందని దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, బ్రిడ్జిల వద్ద సెల్ఫీలు దిగే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని గుర్తు చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడికి వెళ్ళుతున్నది ఆరాతీసి జాగ్రత్తగా ఉండేవిధంగా పిల్లలకు సూచనలు చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు చాటింపు సైతం వేయించాము అన్నారు.ఇనుప విధ్యుత్ స్తంభాలను తాకవద్దని సూచించారు.