• ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై ఆరా తీసిన .. గ్రామ సర్పంచ్ నాగర్జున
  • ప్రధాన రోడ్డు మరమ్మతులు చేయిస్తున్న దృశ్యం

తాండూరు రూరల్ జులై 12 జనవాహిని ప్రతినిధి :– జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పురాతన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉండడంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటబాస్పల్లి సర్పంచ్ కుర్వ నాగర్జున గ్రామ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు గ్రామంలోని ఇంటింటికి తిరిగి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పురాతన ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ నాగార్జున ప్రజలకు పలు సూచనలు చేశారు. అధికంగా కురిసిన వర్షం కారణంగా ఏవైనా ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అలాంటి కుటుంబాలకు పునరావాసం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే వర్షాలు అధికంగా కురవడంతో అక్కడక్కడ ఏర్పడిన గుంతలలో వర్షపు నీళ్లు నిలుస్తాయని చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదన్నారు. చిన్నపిల్లలు సరదాగా చాపలు ఉంటాయని ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. నీటి గుంతల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తాండూరు చించోళి ప్రధాన రోడ్డు మార్గంలో ఏర్పడిన గుంతలను జెసిపి సహాయంతో దగ్గరుండి మరమ్మత్తులు చేయించారు. దీంతో పలువురు వాహనదారులు రాకపోకలకు ఎంతో ఇబ్బందిగా ఉండేదని ప్రస్తుతం గుంతలను పూడ్చడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పడిన సమస్య ఏదైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం చాలా సంతోషకరమని గ్రామ సర్పంచ్ నాగార్జునను ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైసీపీ గుర్రంపల్లి మొగులప్ప, గ్రామస్తులు రామ్ శెట్టి నాయక్, సురేష్, నర్సయ్య, మల్కయ్య, రామప్ప, నందు, హన్మంతు, పలువురు యువకులు ఉన్నారు.