• పత్తి పంట రైతులకు పలు సూచనలు చేసిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్..
  • పత్తి పంట రైతులు వర్షాకాలంలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.

తాండూరు రూరల్ జులై 12 జనవాహిని ప్రతినిధి :– ప్రస్తుత వర్షాకాలంలో ప్రత్తి పంట సాగు చేసే రైతులు పొలంలో నుండి నీటిని వీలైనంత త్వరగా బయటకు తీసే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాండూరు వ్యవసాయ పరిశోధన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ అధికారి ఏఈఓ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు పంట మొలకల దశలో ఉన్న సమయంలోనే పంట పొలంలో గొర్రుతో పంటలో చదును చేయాలన్నారు. అదేవిధంగా ఎకరానికి 25 కిలోల యూరియా 15 కిలోల ఎంఓపి అనే రకం ఎరువును తగిన మోతాదులో వేయాలన్నారు. మట్టిలో ఎరువులు వేయడం సాధ్యం కాకపోతే, త్వరగా కోలుకోవడానికి పాలీఫీడ్ (19:19:19) లేదా మల్టీ-కె (13 0-45) లేదా యూరియా @ 10గ్రాములు లీటరు నీటికి రెండుసార్లు పంట మీద పిచికారీ చేయాలని సూచించారు. పంట . 20-25 రోజుల దశలో కలుపు నివారణకు
టార్గా సూపర్( క్విజలో ఫోపెథైల్)అనే రకం రసాయన మందు 400 మిల్లీ గ్రాముల హైట్వీడు(పైరిథియోబాక్ సోడియం) 250 మిల్లి లీటర్లు పిచికారీ చేయడం ద్వారా గడ్డి మొలకలు నివారించడానికి అవకాశం ఉందన్నారు.అదేవిధంగా వెడల్పు తుంగ జాతి కలుపు మొక్కలను సైతం నియంత్రించవచ్చని పేర్కొన్నారు . మట్టి ద్వారా మొక్కలకు సంక్రమించే వ్యాధులు ( విల్ట్ ) వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ @ 3 గ్రాములు లీటారుకు లేదా కార్బెండజిమ్ + మాంకోజెబ్ @ 2 గ్రా / లీటరుతో మొక్క మొదలు తడిపేటట్టు పిచికారి చేయాలని చెప్పారు.కంది పంట మొలక దశలో వీలైనంత త్వరగా పొలం నుండి నీటిని బయటకు తీసే విధంగా జాగ్రత్తలు చేపట్టడం మంచిదన్నారు, కలుపు మొక్కలను నియంత్రించడానికి టార్గాసూపర్ లేదా azil అజిల్ (కంది అంతర్ పంట వేసినప్పుడు) అనే రకం మందులు వాడాలని చెప్పారు. కంది ఏక పంటగా వేసినప్పుడు ఇమాజితఫైర్ అనే కలుపు మందుని 20-25 రోజుల దశలో పిచికారి చేసుకొని గడ్డి మరియు వెడల్పాటి కలుపు మొక్కలను నివారించుకోవచ్చని చెప్పారు.ఫైటోఫ్తోరా స్టెమ్ బ్లైట్ వ్యాధికి అనుకూలమైన పరిస్థితులు. నివారణకు లీటరు నీటికి 2 గ్రా.లో మెటాలాక్సిల్‌తో మట్టిని తడపాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న పంట మొలక దశలో నీటి ఎద్దడి పరిస్థితులకు చాలా సున్నితంగా ఉంటుంది. పొలం నుండి అదనపు నీటిని వీలైనంత త్వరగా బయటకు తీయాలని చెప్పారు, ఈ పంటలు ఎకరాకు 20 కిలోల యూరియా 10 కిలోల ఎంఓపి అనే రకం ఎరువును పొలంలో నిల్వ ఉన్న అదనపు నీటిని తీసివేసిన తర్వాత పంట మొక్కల అడుగు భాగంలో వేయాలి అన్నారు. కలుపు మొక్కలను నియంత్రించడానికి అంతర కృషి చేయాలి. మట్టిలో రసాయనాయన ఎరువులు వేయడం సాధ్యం కాకపోతే, పోషణకు మద్దతుగా కే ఎన్ O3 రకం 1 శాతం లేదా 19 శాతం పిచికారీ చేయాలని కోరారు.సోయాబీన్ పంటలకు మొలకల దశ 25 రోజుల నుంచి పంట చేతికి వచ్చే వరకు,పొలంలో అదనపు నీటిని వీలైనంత త్వరగా బయటకు తీసివేయాలన్నారు, ఎకరాకు 20 కిలోల యూరియా 10 కిలోల ఎంఓపిని తగిన మోతాదుగా నీటిని కలిపి పిచికారి చేయాలన్నారు. .మట్టిలో ఎరువులు వేయడం సాధ్యం కాకపోతే, పోషణకు తోడ్పాటుగా యూరియా 2 శాతం లేదా కెఎన్ O3 రకం అనే ఎరువు 1 శాతం మేర ఆకుల మీద పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.బొగ్గు తెగులు వ్యాధికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నియంత్రణ కోసం, లీటరు నీటికి 3 గ్రా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌తో మొక్కలకు కాండం దగ్గర మట్టిని తడిసే విధంగా స్ప్రే చేయాలని రైతులకు పలు సూచనలు చేశారు.