• గ్రామంలోని అన్ని వ్యవస్థలు బాగుంటేనే గ్రామ అభివృద్ధి సాధ్యం.. సర్పంచు వీణ హేమంత్ కుమార్
  • ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ముళ్ళకంచెల తొలగింపు
  • పాఠశాల ఆవరణలో లెవలింగ్ పనులు

తాండూరు రూరల్ జులై 11 జనవాహిని ప్రతినిధి :- గ్రామంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధికి అడుగులు వేసినట్లు ఉంటుందని తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్ వెల్లడించారు. స్థానికంగా ప్రజల రాకపోకలు సాగించే కొర్వాన్ హుస్సేన్ ఇంటి ముందర గల కంప చెట్లతో ప్రజల రాక పోకలకు తీవ్రంగా ఇబ్బంది ఉండటంతో జేసిబి సహాయంతో తొలగించడం జరిగిందని చెప్పారు. ముళ్ళ కంచలు తొలగించడంతో రాకపోకలకు సులువుగా అయిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల ఆవరణలో పలు ప్రాథమిక పాటశాలలు సైతం కొనసాగుతున్నాయి దీంతో వర్షం కారణంగా పాటశాల ప్రాంగణంలో బురదగా మారి విద్యార్థులకు అసౌకర్యవంతంగా మారడంతో గ్రౌండ్ ప్రాంతంలో జేసిబి సహాయంతో అక్కడక్కడా డస్ట్ శిల్ప వేసి లెవలింగ్ చేయించడం జరిగిందన్నారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో ఇబ్బందులు రావడంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ గుర్తు చేశారు. అలాగే హరిజన కొత్తప్లాట్ల పరిసరాలలో ఏపుగా పెరిగిన ముళ్ళ కంప తొలగించారు. మంచినీటి బోరు పంపు వద్ద నీళ్లు నిలవడంతో ప్రస్తుత వర్షాకాలంలో బురద మయంగా మారుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఏ విధమైన సమస్య ఎదురైనా స్వయంగా దగ్గరుండి చేయించడమే సంతృప్తినిస్తుందని చెప్పారు. అదేవిధంగా గ్రామంలోని అన్ని వార్డులలో ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని ప్రజలను కోరారు. అన్ని ప్రదేశాలలో మురుగునీరు నిలవకుండా ఉండేవిధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలు ఆరుబయట మురుగు కాలువలలో చెత్త మిగిలిపోయిన అన్నం వంటివి పార వేయకుండా చెత్తశేకరణ వాహనంలో వేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధమైన రోగాల బారిన పడకుండా ఉంటామని సూచించారు.