తాండూరు రూరల్ జూన్ 21 (జనవాహిని ప్రతినిధి):- తాండూర్ మండలం జిన్గూర్తి గ్రామ సమీపంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల (ఇంగ్లీష్)లో తెలుగు,గణితం సబ్జెక్ట్ లలో 10 తరగతి వరకు బోధించుటకు అధ్యపకుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదర్శ పాటశాల ప్రిన్సిపాల్ వై ప్రకాష్ గౌడ్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన పనిచేయుటకు తెలుగు సబ్జెక్ట్ అధ్యపకులకు టిజిటి,తో పాటు ఎమ్ఏ తెలుగు,టిపిటి, బీఈడి, టిఈటి, అర్హతలు కాగ గణితం బోధించుటకు ఎంఎస్సీ మ్యాథ్స్ టెట్ క్వాలిఫైడ్ అయినా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.అర్హులైన అభ్యర్థులు ద్వారా దరఖాస్తులను కోరుతూ ఈ నెల 23 దరఖాస్తులను సమర్పించాల్సిందిగా కోరారు. అభ్యర్థులకు ప్రతి నెల రూ 18 వేల 200లు ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24న ఆదర్శ పాఠశాలలో డెమో క్లాసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here