ఖమ్మం ( జనవాహిణి ప్రతినిధి) :- టయోటా, ఐచార్ పోలీస్ వాహనాల మెయింటెనెన్స్ లో భాగంగా పోలీస్ వాహనాల డ్రైవర్లకు అవగాహన పెంపొందించేందుకు వన్డే వర్క్ షాప్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించారు. అయా వాహనాలకు సంబంధించిన టెక్నీషియన్స్ పాల్గొని శిక్షణ
ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…ప్రజా సేవ కోసం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పోలీస్ శాఖకు కల్పించిన ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని వాహనాల నిర్వహణ క్రమశిక్షణతో పారదర్శకంగా భాద్యతలు చేపట్టాలని అన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎఏస్సై మృతి చెందడం దురదృష్టకరమని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలి లని అన్నారు. విధిగా ఇలాంటి రిఫ్రెష్ కోర్స్ లు షిఫ్ట్ లు వారిగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా
పోలీస్ డ్రైవర్లకు క్రమశిక్షణ అనేది చాల కీలకమని ఎవరికైతే వాహనాలు అప్పగించామో వారిదే పూర్తి భాద్యతని అన్నారు. పూర్తి ఫిట్నేస్ కండిషన్ ఉండేలా నిర్వహణ చర్యలు చేపట్టాలని అన్నారు. రోజు వారిగా వాహనం తిరిగే వివరాలు ఎప్పటికప్పుడు లాగ్ బుక్ లో నమోదు చేసుకొవాలని సూచించారు. ఏ సమయంలో ఇంజన్ అయిల్ ఫిల్టర్ మార్పు చేయాలి నిర్వహణలో డ్రైవర్లు తీసుకొవల్సిన భాద్యతలు వివరించారు.
ఏదైనా సమస్య తలెత్తిన పై అధికారుల దృష్టికి తీసుకొని రవాలని అన్నారు. వాహనాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి రివార్డ్ ఇస్తామని అన్నారు.
కార్యక్రమం లో ఏఆర్ అడీషనల్ డీసీపీ కుమారస్వామి ఎంటిఓ శ్రీనివాస్ ఆర్ ఐ రవి, శ్రీశైలం
ఎంటి సెక్షన్ మెకానిక్ టి. రాంబాబు పాల్గొన్నారు.