పెద్ద కొడప్గల్(జనవాహిణి):-కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మెనూర్ గ్రామ ఆదర్శ పాఠశాల విద్యార్థి కొండవార్ హన్మాండ్లు ఐదు రోజులైనా ఆచూకీ లేక బాలుడి అదృశ్యంతో తల్లి పుట్టెడు బాధలో ఉంది.ఒక వైపు పోలీస్ సిబ్బంది అన్ని సిసి ఫుటేజీలను పరిశీలించిన ఒక క్లూ కూడా కనిపించలేదు. బాబు ఎప్పుడు చేరుతాడు అనే ఆలోచనతో దిక్కుతోచని పరిస్థితిలో తల్లి అన్వేషణలో ఉంది.
బిచ్కుందలోని ఇంటి నుండి పాఠశాలకు బయలుదేరినప్ప టి నుండి ఇప్పటి శుక్రవారం సాయంత్రం వరకు బాలుడి ఆచూకీ లేకపోవడంతో బాబు ఎలా ఉన్నాడు, ఎట్లా ఉంటున్నాడు, ఎం తింటున్నాడు, ముందే చలి కాలం ఉండటంతో బాలుడి పరిస్థితి ఎలా అనే ఆలోచనలో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.
సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలుడు సాయంత్రం కూడా రాక పోవడంతో ఎవరైనా కిడ్నప్ చేసారా, లేకపోతే బాబు దూర ప్రాంతంకు వెల్లడ, మాయ మాటలు చెప్పి బాలుడికి తీసుకోని వెళ్ళారా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. గత నాలుగు రోజుల నుండి బాబు ఆచూకీ కోసం పత్రికలలో వస్తున్న ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల ఒక తప్పు మూలంగా ఏకైక కుమారుడు అదృశ్యం కావడంతో తల్లి తల్లడిల్లుతుంది.
చదువులో అందరి కంటే ముందు ఉండే బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు సందిగ్ధంలో ఉన్నారు. అదృశ్యం అయిన కొండవార్ హన్మాండ్లు ఇంటికి తొందరగా రావాలని కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here