ఖమ్మం (జనవాహిణి ప్రతినిధి):- ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని రఘునాథపాలెం పోలీస్​ స్టేషన్​ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్​ స్టేషన్​ పరిసరాలు స్టేషన్​ నిర్వహణ పోలీసుల పనితీరు రికార్డులను సీపీ పరిశీలించారు. కేసుల వివరాలు శాంతి భద్రతలు నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు.శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో రోల్ క్లారిటీ ఉండాలని అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ.పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here