Home Cinema ‘కబాలి’ డైరెక్టర్ తో కమల్!

‘కబాలి’ డైరెక్టర్ తో కమల్!

285
0

Kamal in Kabali Director
  • ‘విక్రమ్’ షూటింగులో కమల్ 
  • సొంత బ్యానర్లో చేస్తున్న ప్రయోగం 
  • ‘సార్పట్ట’తో మెప్పించిన రంజిత్ 
  • పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన కమల్
కమలహాసన్ ఇప్పుడు ‘విక్రమ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఫహద్ ఫాజిల్ .. విజయ్ సేతుపతి .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. వీరి కాంబినేషన్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా తరువాత కమల్ .. ‘కబాలి’ డైరెక్టర్ పా రంజిత్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా తక్కువ గ్యాప్ లో రజనీతో రంజిత్ ‘కబాలి’ .. ‘కాలా’  సినిమాలు చేశాడు. ఆ సినిమాల ఫలితం అలా ఉంచితే, అప్పటివరకూ తెరపై కనిపిస్తూ వచ్చిన రజనీ లుక్ ను పూర్తిగా మార్చేసిన దర్శకుడిగా మార్కులు కొట్టేశాడు.
ఇటీవల ఆర్య ప్రధానమైన పాత్రగా రంజిత్ తెరకెక్కించిన ‘సార్పట్ట’ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆయనకి కమల్ ఛాన్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం కమల్ చేస్తున్న సినిమా షూటింగు పూర్తికాగానే, రంజిత్ తో సెట్స్ పైకి వెళతాడట. అయితే ఇది కమల్ బ్యానర్లో ఉంటుందా? వేరే నిర్మాతలతో ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page