ఎల్లారెడ్డి అక్టోబర్ 31 (జనవాహిణి ప్రతినిధి):- ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి కరాడ్ పల్లి, మరియు సదాశివ నగర్ మండలం లింగం పల్లి,జనగామ గ్రామంలో నూతనంగా 600 ఎకరాలలో పారిశ్రామిక పార్క్ ను ప్రభుత్వం చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్న రైతుల యొక్క భూములలో జెండాలు పెడుతూ పెద్ద పెద్ద జేసీబీ లతో పనులను చేస్తున్నారు
ఈ విషయమై అక్కడి రైతులు వారి యొక్క సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇన్ఛార్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తెలపగా ఆదివారం రోజు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆ యొక్క భూములను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా బీద రైతుల యొక్క పట్టా భూములను పరిశీలించి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కి అడ్డుపడడం మా ఉద్దేశ్యం కాదు కాని బీద రైతుల యొక్క అసైన్డ్ పట్టా భూములను లాక్కొని రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు..అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలకు అమ్ముపోయిన ఎం.ఎల్.ఎ రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరిని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు.