• విజయవాడ హోటల్ గేట్ వేలో రిలీజ్ చేయనున్న మంత్రి ఆదిమూలపు
  • లాక్ డౌన్ రోజుల్లోనూ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి
  • ఆలస్యమైనా తగిన జాగ్రత్తలతో మూల్యాంకనం

ఓవైపు కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నా, ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలకు రంగం సిద్ధం చేసింది. రేపు సాయంత్రం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ను రేపు సాయంత్రం 4 గంటల తర్వాత విజయవాడలోని గేట్ వే హోటల్ లో మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేస్తారు. లాక్ డౌన్ కారణంగా మూల్యాంకనం ఆలస్యమైనా, ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎట్టకేలకు ఫలితాల వెల్లడికి మార్గం సుగమం చేసింది. ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలోనే ఇంటర్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు.