చీర కట్టులో ఉన్నంత అందం ఇంకెందులోను అగుపించదు. అందుకనే కాబోలు ఓ సినీ కవి అందమంతా చీరలోనే ఉన్నది అంటూ ఏకంగా ఓ పాపులర్ పాటనే రాశాడు. కురుచ దుస్తుల్లో అందాలు అగుపించేలా, మరీ ఎబ్బెట్టు కలిగించేలా మహిళల కంటే భారతీయత ఉట్టి పడేలా వస్త్రధారణతో ఉండే వారే ఎక్కువగా ఆకట్టుకుంటారు. అందుకే ఇండియన్ విమెన్స్ కు ఎక్కడలేని గౌరవం. వారంటే ప్రత్యేకమైన ప్రేమ కూడా. తాజాగా బాలీవుడ్ స్వప్న సుందరి, మోస్ట్ మెమొరబుల్ నటీమణిగా పేరున్న దీపిక పదుకొనె తన భర్తతో కలిసి తిరుమలకు విచ్చేశారు. వీరిద్దరూ సకుటుంబ సపరివారంతో ఆ శ్రీ వేంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు.

తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతులిద్దరూ స్వామి వారి సేవలో తరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోయారు. అయితే, దీపిక కట్టుకున్న చీర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తిరుమలలో దీపిక అందమైన బనారస్ చీరలో తళుక్కు మనగా, రణ్‌వీర్ ఆమె చీర రంగుకు మ్యాచ్ అయ్యేలా కుర్తా చుడీదార్, నెహ్రూ జాకెట్ ధరించాడు. డిజైనర్ సబ్యసాచి వీటిని తీర్చిదిద్దాడు. దీపిక కట్టుకున్న ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఆమెకు వివాహ సమయంలో గిఫ్ట్‌గా వచ్చినది. దీపిక వివాహం సందర్భంగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

ఆ ఫొటోలో దీపిక చేతిలో ఉన్నది ఇప్పుడు కట్టుకున్న చీరే కావడం గమనార్హం. మనసుకు హత్తుకున్న ఈ చీరను దీపిక ఇన్నాళ్లపాటు జాగ్రత్తగా దాచి పెట్టుకుని ఇప్పుడు కట్టుకుంది. కాగా, స్వామి వారి దర్శనానంతరం దీపిక తన ఇన్‌స్టాలో రణ‌్‌వీర్‌తో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన, దీవించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉండగా రణబీర్ దుస్తుల కంటే ఎక్కువగా దీపిక కట్టుకున్న చీరనే హైలెట్ గా నిలవడం ఇప్పుడు చర్చ నీయాంశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here