• ముంబై క్షేమకరం కాదనుకున్న శ్రుతి హాసన్ 
  • రోడ్డుమార్గంలో హైదరాబాదుకి రాక
  • త్వరలో ఇక్కడే షూటింగులు

తనకు షూటింగులు లేకపోతే కనుక అందాలతార శ్రుతి హాసన్ ముంబైలో కానీ, చెన్నైలో కానీ వుంటుంది. అలాంటిది ఇప్పుడు షూటింగులు ఏవీ లేకపోయినా అమ్మడు హఠాత్తుగా హైదరాబాదులో వచ్చివాలింది. దీనికి కారణం ఏమిటంటే, కరోనా భయమట!

గత కొంతకాలంగా ఈ చిన్నది ముంబైలో ఉంటోంది. అయితే, ప్రస్తుతం ముంబైలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో వుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు వేలల్లో పెరిగిపోతున్నాయి.  దీంతో ఇంకా అక్కడే వుండడం క్షేమకరం కాదని భావించిందట. ఓపక్క చెన్నై వెళదామంటే అక్కడ కూడా కరోనా జోరుమీదే వుంది. దాంతో ఇక హైదరాబాదే సేఫ్ అని నిర్ణయించుకున్న శ్రుతి తన స్టాఫ్ ను తీసుకుని రోడ్డు మార్గంలో హైదరాబాదుకి వచ్చేసినట్టు తెలుస్తోంది.

ఎలాగూ త్వరలో పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగుతో పాటు రవితేజతో నటిస్తున్న ‘క్రాక్’ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే ప్రారంభమవుతాయి. అందుకని ఇక్కడే వుండడం మంచిదని ముద్దుగుమ్మ నిర్ణయించుకుందట. నగరంలో ఓ మంచి ఇల్లును అద్దెకు తీసుకుందని తెలుస్తోంది.