మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ అల్లు అర్జున్, లవ్లీ గర్ల్ పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అల వైకుంఠ పురం లో..సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలను చిత్ర యూనిట్ విడులా చేసింది. ఈ రెండూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మొదటి పాట సామజ వరగమనా..ను ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. ఇది బిగ్ హిట్ అయ్యింది. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. యూట్యూబ్ లో విడుదలైన కొద్దీ నిమిషాల్లోపే లక్షలాది మంది దీనిని చూసారు..విన్నారు.

దీంతో మంచి ఊఒపు మీదున్న త్రివిక్రమ్ ..మాస్ ఆడియన్స్ ..యూత్ కు జోష్ తీసుకు వచ్చేలా రెండవ సాంగ్ రాములో రాములా..ను విడుదల చేశారు. ఈ పాటను వరంగల్ జిల్లాకు చెందిన గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాశాడు. ఇది మరింత పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ ను అనురాగ్ కూల్ కర్ణి తో పాటు ప్రముఖ జానపద గాయని, యాంకర్ మంగ్లీ పాడారు. ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ మాస్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అల వైకుంఠపురం లో..సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. భారీ బడ్జెట్ తో దీనిని తీస్తున్నారు.

బన్నీకి ఇటీవల చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో మరింత కసితో దీనిలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. ఇదిలా ఉండగా చిత్ర బృందం సిరివెన్నెల రాసిన పాట షూటింగ్ కోసం ప్యారిస్ వెళ్ళింది. అక్కడ ఈ పాటను మరింత బెటర్ గా తీసే పనిలో పడ్డారు డైరెక్టర్. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. కాగా ఈ పాటతో చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయినట్లే . ఈ ‘అల.. వైకుంఠపురమలో..’ జనవరి 12న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here