కరోనాపై జిన్ పింగ్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్న ట్రంప్!

కరోనా కేసుల విషయంలో చైనాను మించిన అమెరికా నేటి రాత్రి 9 గంటలకు జిన్ పింగ్ తో చర్చలు స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనాతో పోలిస్తే, అమెరికాలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో చర్చించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన వారి సంఖ్య 85 వేలు దాటగా, 1300 మందికి పైగా మరణించారు. […]

Continue Reading

వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా తీవ్ర అభియోగాలు.. ఆయన తలపై 15 మిలియన్ డాలర్ల రివార్డు

అధ్యక్షుడు మాడ్యురో, ఆయన అధికారులపై అమెరికా తీవ్ర అభియోగాలు రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదు అమెరికాపై మండిపడిన వెనిజులా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో అరెస్టుకు తోడ్పడే సమాచారం అందించిన వారికి 15 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ మాడ్యురో సహా ఆయన ప్రభుత్వంలోని ఇతర అధికారులపైనా అమెరికా అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే ఈ రివార్డు ప్రకటించినట్టు అమెరికా అటార్నీ జనరల్ విలియమ్ బార్ తెలిపారు. […]

Continue Reading

చేతులు శుభ్రం చేసుకోని దేశాల్లో చైనా టాప్!: షాకింగ్ సర్వే

భారత్‌లో సగం మంది చేతులు కడుక్కోరు జాబితాలో భారత్‌కు పదో స్థానం సౌదీని చూసి నేర్చుకోవాలంటున్న సర్వే నివేదిక చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం.. కరోనా వైరస్‌కు ఇప్పుడున్న ఔషధాలు ఈ రెండే. వీటిని తు.చ. తప్పకుండా పాటించడం వల్ల ఈ ప్రాణాంతక వైరస్ బారి నుంచి కొంతవరకు రక్షించుకోవచ్చు. అయితే, ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో సగం మందికి చేతులు శుభ్రం చేసుకునే అలవాటే […]

Continue Reading

హెచ్చరిక.. పొగతాగేవారికి కరోనా ముప్పు అధికం!

పొగతాగేవారిలో కరోనా వచ్చే అవకాశం 14 శాతం ఎక్కువ చైనాలో వేలాదిమంది రోగులపై జరిపిన పరిశోధనలో వెల్లడి ఒకే సిగరెట్‌ను పంచుకుని తాగడం వల్ల కూడా సోకే ప్రమాదం పొగతాగే వారికి ఇది హెచ్చరికే. ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్.. పొగతాగేవారిపై మరింత పగబడుతుందని చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. మిగతా వారితో పోలిస్తే ధూమపానం చేసేవారిలో వైరస్ సోకే అవకాశం 14 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా సోకిన వేలాదిమందిపై […]

Continue Reading

ఇక మరణ మృదంగం అమెరికాలో… కరోనా కేసుల విషయంలో వరల్డ్ టాప్!

యూఎస్ లో 83 వేలు దాటిన కేసులు 1,178 దాటిన మృతులు యుద్ధం చేస్తున్నామన్న డొనాల్డ్ ట్రంప్ కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఇప్పుడు ఇటలీ, చైనాలను అధిగమించింది. గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి రాగా, ప్రస్తుతం చైనాలో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది. ఆపై ఇటలీలో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు పెరుగగా, ఇప్పుడా స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అమెరికాలో గురువారం నాటికి […]

Continue Reading

ఇక మేము సాయం చేస్తాం: ఇండియాకు చైనా ఆఫర్

గతంలో వూహాన్ కు ఔషధాలు పంపిన ఇండియా గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన చైనా ఎంబసీ కరోనాపై పోరులో సహాయపడతామని హామీ చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, ఇండియా నుంచి ప్రత్యేక విమానంలో వైద్య పరికరాలు, మందులను పంపిన విషయాన్ని ప్రస్తావించిన చైనా, అందుకు కృతజ్ఞతలు చెబుతూనే, ఈ మహమ్మారిపై పోరులో ఇక భారత్ కు సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు చైనా ఎంబసీ కౌన్సిలర్ జీ […]

Continue Reading

ఏ అనారోగ్యమూ లేకున్నా… కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమే!

యూకేలో మరణించిన చలోయి మిడిల్టన్ నివాళులు అర్పించిన ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. అంతవరకూ ఆమెకు ఎటువంటి అనారోగ్యమూ లేదు. అయితే, కరోనా మహమ్మారి ఆమె ప్రాణాలను కబళించి వేసింది. ఎలాంటి రోగాలూ లేకుండా కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమెనే అని వైద్యాధికారులు గుర్తించారు. యూకేలోని బకింగ్‌ హామ్‌ షైర్‌ లో నివాసం ఉంటున్న చలోయి మిడిల్టన్ అనే యువతి కరోనా కారణంగా మృత్యువాత […]

Continue Reading

కరోనాపై… రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన నరేంద్ర మోదీ!

కరోనాపై అభిప్రాయాలు పంచుకున్న ఇరు నేతలు భారత్ చర్యలు సంతృప్తికరమన్న పుతిన్ కరోనా నుంచి బయటపడుతుందన్న ఆశాభావం కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ లో మాట్లాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ పరిస్థితిపై వీరిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని రష్యాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ, వైరస్ పై రష్యా చేస్తున్న పోరాటం విజయవంతం […]

Continue Reading

ఎంత జాగ్రత్తగా ఉండాలంటే.. అంత జాగ్రత్తగా ఉండాలి: న్యూజిలాండ్ ప్రధాని

కరోనా సోకిందన్న భావనతో జాగ్రత్తగా ఉండాలని సూచన దేశంలో ఒకేసారి 50 మందికి సోకిన వైరస్ ముందు జాగ్రత్త చర్యగా నెల రోజులపాటు లాక్‌డౌన్ న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం నెల రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ దేశ ప్రజలను ఉద్దేశించి  మాట్లాడారు. వైరస్ విషయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కరోనా వైరస్ సోకితా ఎంత అప్రమత్తంగా ఉంటారో.. […]

Continue Reading

నేడు జీ-20 దేశాధినేతల అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ .. పాల్గొననున్న మోదీ

వైరస్ విస్తృతి కట్టడిపై చర్చించనున్న దేశాధినేతలు ప్రత్యేక ఆహ్వానిత దేశాధినేతలు కూడా హాజరు నేతృత్వం వహించనున్న సౌదీ రాజు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నేడు జీ-20 దేశాధినేతలు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్నారు. జీ-20 దేశాలతోపాటు ఆహ్వానిత దేశాలైన స్పెయిన్, జోర్డాన్, సింగపూర్, స్విట్జర్లాండ్ ప్రతినిధులు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ […]

Continue Reading